పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొకైన్ డ్రగ్ వాడినట్లు పాక్ అధికారులు వెల్లడించారు. పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి అబ్దుల్ ఖాదిర్ పటేల్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఐదుగురు వైద్యుల ప్యానెల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అవినీతి కేసులో అరెస్టైన ఇమ్రాన్ ఖాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించగా.. వాటిలో మద్యం, కొకైన్ వాడినట్లు వెల్లడైంది. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో అరెస్టయిన తర్వాత ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇమ్రాన్ ఖాన్ మూత్ర నమూనాను తీసుకున్నారు. ప్రాథమిక వైద్య నివేదికలో “ఆల్కహాల్ మరియు కొకైన్” వంటి “టాక్సిక్ కెమికల్స్” వాడినట్లు వెల్లడైంది.
తాజాగా ఇమ్రాన్ ఖాన్ ను 'నో ఫ్లై లిస్టు' లో చేర్చారు. ఇమ్రాన్ తో పాటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)కి చెందిన పలువురు నేతలను కూడా 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చారు. విదేశాలకు పారిపోదామని అనుకున్నా కూడా వెళ్లకుండా చేసింది ప్రస్తుత ప్రభుత్వం. నివేదికల ప్రకారం, నో-ఫ్లై జాబితాలో.. ఖాసిం సూరి, అసద్ ఉమర్, అసద్ ఖైజర్, అస్లాం ఇక్బాల్, యాస్మిన్ రషీద్, మురాద్ సయీద్, మలికా బుఖారీ, ఫవాద్ చౌదరి, హమ్మద్ అజార్ వంటి ప్రముఖ PTI నాయకులు ఉన్నారు.