పాకిస్థాన్ కు డ్రోన్స్ అమ్మిన చైనా.. భారత్ ను టార్గెట్ చేయమనేగా..?
Chinese media's reporting on supply of armed drones to Pakistan is just psyops. చైనా- పాకిస్తాన్ రెండు దేశాలు భారత్ ను
By Medi Samrat Published on 26 Dec 2020 6:23 PM ISTచైనా- పాకిస్తాన్ రెండు దేశాలు భారత్ ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. భారత్ శాంతి అంటుంటే ఈ రెండు దేశాలు మాత్రం కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పాక్ ను చైనా వెనుకేసుకుని వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం బయటకు వచ్చింది. పాక్‌కు తాజాగా 50 సాయుధ డ్రోన్లను విక్రయించడానికి రెడీ అయ్యింది చైనా. ఈ డ్రోన్లన్నీ పూర్తిగా ఆయుధాలను మోసుకెళ్లగలవని, వీటిని త్వరలో పాక్‌కు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చైనా మీడియా సంస్థలు ధృవీకరించాయి.
చైనా అభివృద్ధి చేసిన వింగ్ లూంగ్-2 డ్రోన్లు పూర్తి సాయుధ టెక్నాలజీతో పనిచేస్తాయి. పూర్తి స్థాయిలో ఆయుధాలను మోసుకెళ్లి నిర్దిష్ట ప్రాంతంలో జారవిడిచే శక్తి ఉందని అంటున్నారు. పాక్ భారత్ ను ఇబ్బందులు పెట్టొచ్చు అని చైనా ఈ నిర్ణయం తీసుకుంది. భారత మిలటరీ ఈ డ్రోన్లను ఎదుర్కోలేదని చైనా మీడియా చెబుతోంది. లిబియా, సిరియా, అజర్‌బైజాన్ ఘర్షణల్లో సాంప్రదాయ యుద్ధాన్ని నమ్ముకున్న ప్రత్యర్థులను ఈ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయని, శత్రువుల రక్షణ వ్యవస్థలను చిత్తు చేశాయని.. ఇలాంటి డ్రోన్లు చైనా, టర్కీ వద్ద మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు పాక్ కూడా అందించేందుకు చైనా సిద్ధమైందని చెబుతున్నారు.
చైనా డ్రోన్లు పనిచేస్తాయో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని భారత్ కౌంటర్ ఇచ్చింది. తమకు పట్టున్న ప్రాతంలో మాత్రమే డ్రోన్లతో దాడి చేయగలమని, ఎక్కడికైనా వెళ్లి దాడి చేయడం సాధ్యం కాదని భారత్ వివరించి చెప్పింది. ఆఫ్ఘన్ గగనతలంపై పట్టు ఉండడం వల్లే అమెరికా ఉగ్రవాదులపై, వారి స్థావరాలపై దాడులు చేయగలుగుతుందని.. సరిహద్దుల వద్ద భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి దాడులకు చైనా లేదా పాకిస్థాన్‌కు పాల్పడలేవని స్పష్టం చేసింది. పాకిస్థాన్, చైనా సరిహద్దులోని భారత రాడార్లు, యుద్ధ విమానాల అనుక్షణం నిఘా ఉంటాయని, వాటిని దాటుకుని లోనికి రావడం చైనా డ్రోన్లకే కాదు.. ఏకంగా చైనా యుద్ధవిమానాలకు కూడా సాధ్యం కాదని వివరించింది.