చైనాలో భారీ పేలుడు సంభవించింది. హ్యూబెయ్ ప్రావిన్స్ లోని షియాన్ సిటీలోని ఓ భవన సముదాయం వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం పాలవ్వగా.. 144 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 37 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
2013, 2015లో కూడా ఇటువంటి భారీ ప్రమాదాలు జరిగాయి. 2013 ఖింగ్డావోలో పైప్ లైన్ లు లీకై పెద్ద పేలుడు సంభవించడంతో 55 మంది చనిపోయారు. 2015లో ఓ రసాయన గోదాములో జరిగిన ప్రమాదంలో 173 మంది మరణించారు. అందులో ఎక్కువగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులే ఉన్నారు. 2013లో సంభవించిన పేలుడులాగే ఈ పేలుడూ జరిగివుంటుందని చెబుతున్నారు.