చైనా.. భారత్ ను మరోసారి కవ్వించే పనులు చేపట్టింది. జూన్ చివరి వారంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వద్ద చైనా విమానం భారత స్థానాలకు చాలా దగ్గరగా వచ్చింది. భారత వైమానిక దళం (IAF) త్వరగా స్పందించడంతో చైనా ఎయిర్ క్రాఫ్ట్ వెనకడుగు వేసింది. తూర్పు లడఖ్ సెక్టార్‌లో చైనా వైపు గత కొన్ని నెలల్లో గగనతల ఉల్లంఘన జరగడం ఇదే మొదటి సంఘటన అని తెలుస్తోంది.
సరిహద్దు ప్రాంతంలో మోహరించిన IAF రాడార్ ద్వారా చైనా విమానాన్ని గుర్తించారు. తూర్పు లడఖ్‌కు సమీపంలో చైనా వైమానిక దళం నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ప్రధాన కసరత్తు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. చైనీయులతో ఉన్న నిబంధనల ప్రకారం భారతదేశం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది.