'రాఫెల్ కేవలం ఒక విమానం కాదు'.. పాక్‌, చైనాల‌పై డస్సాల్ట్ ఏవియేషన్ ఫైర్‌

డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్ CEO ఎరిక్ ట్రాపియర్ పాకిస్తాన్ దుర్మార్గపు ప్రణాళికలను తిప్పికొట్టారు.

By Medi Samrat
Published on : 8 July 2025 2:14 PM IST

రాఫెల్ కేవలం ఒక విమానం కాదు.. పాక్‌, చైనాల‌పై డస్సాల్ట్ ఏవియేషన్ ఫైర్‌

డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్ CEO ఎరిక్ ట్రాపియర్ పాకిస్తాన్ దుర్మార్గపు ప్రణాళికలను తిప్పికొట్టారు. ఇటీవల పాకిస్థాన్‌తో సైనిక ప్రతిష్టంభన సందర్భంగా భారత్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలను కోల్పోయిందని వచ్చిన తప్పుడు వార్తలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు.

రఫేల్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్, చైనా సంయుక్తంగా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఫ్రాన్స్ అధికారులు వెల్లడించారు. ఈ కుట్రలో రాఫెల్ శిథిలాల నకిలీ చిత్రాలు, AI సృష్టించిన కంటెంట్, కొత్తగా సృష్టించిన 1,000 కంటే ఎక్కువ సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయని ఫ్రాన్స్ పేర్కొంది. చైనా టెక్నాలజీని మరింత మెరుగ్గా చూపించి రాఫెల్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకుంద‌న్నారు.

చైనా అధికారులు రాఫెల్ కొనుగోలు చేసిన లేదా కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్న దేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ ప్రకారం.. ఇది బాగా ప్లాన్ చేసిన కుట్ర.. దీని ఉద్దేశ్యం ఫ్రెంచ్ యుద్ధ విమానాల పరువు తీయడమే..!

చైనా ఆయుధాలు మెరుగైన‌వ‌ని చూపించేందుకు రాఫెల్‌పై 'అబద్ధాల పెద్ద వల' అల్లుతున్నారని ఫ్రెంచ్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. "రాఫెల్‌ను లక్ష్యంగా చేసుకోలేదు. ఇది అత్యంత సామర్థ్యం గల యుద్ధ విమానం, ఇది చాలా దేశాలకు ఎగుమతి చేయబడింది.. ఆయా దేశాల ప్రధాన సైనిక కార్యకలాపాలలో మోహరించింది" అని మంత్రిత్వ శాఖ తన వెబ్‌సైట్‌లో రాసింది. రాఫెల్ కేవలం ఒక విమానం కాదు.. ఫ్రాన్స్ వ్యూహాత్మక బలానికి చిహ్నం.. దానిని అపఖ్యాతి పాలు చేయడం ద్వారా, కొన్ని శక్తులు ఫ్రాన్స్ యొక్క విశ్వసనీయతను, దాని రక్షణ సాంకేతికతను, విశ్వసనీయ భాగస్వామ్యాన్ని బలహీనపరచాలనుకుంటున్నాయని వెబ్‌సైట్‌లో రాసింది.

Next Story