భారత్‌లో కొత్తగా ఆ 54 చైనా యాప్ లు బ్యాన్.. కీలక ఆదేశాలు జారీ..
Centre to ban 54 Chinese apps posing threat to national security. చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం మరోసారి కన్నెర్ర జేసింది. దేశ భద్రత దృష్ట్యా
By Medi Samrat Published on 14 Feb 2022 1:29 PM ISTచైనా యాప్‌లపై భారత ప్రభుత్వం మరోసారి కన్నెర్ర జేసింది. దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన మరో 54 యాప్‌లపై నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. ఈక్విలైజర్ అండ్ బాస్ బూస్టర్, యాషెస్ ఆఫ్ టైమ్ లైట్, బ్యూటీ కెమెరా - సెల్ఫీ కెమెరా, ఆన్‌మైఓసీ చెస్, అరెనా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, వివా వీడియో ఎడిటర్, టెన్సెంట్ రివర్, యాప్‌లాక్, డ్యుయల్ స్పేస్ లైట్ వంటి 54 యాప్‌లపై త్వరలోనే నిషేధం విధించనున్నట్లు తెలుస్తోంది.
భారత్ చైనా దేశాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే 2020 జూన్ 15న గల్వాన్ లోయ వద్ద భారత్, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికుల మధ్య ఘర్షణలకు దారితీసింది. దీంతో చైనా కంపెనీలకు భారత ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే కారణాలతో 2020లో ఎన్నో చైనా యాప్స్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది. 2020 జులై నెలలో టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లు, అదే ఏడాది సెప్టెంబరులో మరో 118 యాప్‌లు, నవంబరులో 43 చైనా యాప్‌లపై కొరడా ఝళిపించింది. ఈ వ్యవహారంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ వర్గాల ప్రకారం 54 యాప్‌ల జాబితాలో ఇంతకుముందు నిషేధించినవి కొన్ని ఉన్నాయి. వాటినే రీబ్రాండ్ చేసి కొత్త పేర్లతో తిరిగి ప్రారంభించాయి. అందుకే ఈ యాప్‌లను నిషేధించాలని మరోసారి ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపింది. వ్యక్తిగత భద్రత, ప్రైవసీకి భంగం కలిగిస్తుండడంతో కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాన్ చేసిన యాప్ లలో ఎక్కువ భాగం టెన్సెంట్, అలీబీబా, నెట్ఈజ్ కంపెనీలకు చెందినవే. భారతీయులకు సంబంధించిన సెన్సిటివ్ సమాచారాన్ని చైనాలో ఉన్న సర్వర్లకు చేరవేస్తున్నట్లు గుర్తించి బ్యాన్ చేయాలని ప్రభత్వం నిర్ణయం తీసుకుంది.