పశ్చిమాఫ్రికాలో ఘోర ప్రమాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 91 మంది మృతి

At least 91 people died after a fuel tanker exploded in Sierra Leone. పశ్చిమాఫ్రికా దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని సియారా లియోన్‌లోని ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో 91 మంది మృతి చెందినట్లు

By అంజి  Published on  6 Nov 2021 10:56 AM GMT
పశ్చిమాఫ్రికాలో ఘోర ప్రమాదం.. ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 91 మంది మృతి

పశ్చిమాఫ్రికా దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని సియారా లియోన్‌లోని ఆయిల్‌ ట్యాంకర్‌ పేలడంతో 91 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కొద్ది గంటల క్రితమే ఈ విషాద ఘటనతో అక్కడ రోడ్లన్నీ రక్త సిక్తమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఫ్రీటౌన్‌లో ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. దీంతో అందులోని ఇంధనం లీకయ్యింది. ఇంధనం లీకు కావడాన్ని గమనించిన కొందరు.. దానిని సేకరించేందుకు ఆయిల్‌ ట్యాంకర్‌ దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆ ఆయిల్‌ ట్యాంకర్‌ భారీ శబ్దంతో పేలింది. దీంతో ఇంధనాన్ని సేకరించేచందుకు ట్యాంకర్‌ దగ్గరకు వచ్చిన వారు అందరూ తునాతునకలయ్యారు. ఘటనా స్థలి దగ్గరలో ఉన్న షాపులకు, రోడ్డుపై వెళ్తున్న వారికి మంటలు అంటుకున్నాయి.

ఆ పరిసర ప్రాంతంలో ఎక్కడా చూసినా కాలిపోయిన మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 91 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక అధికారులు అక్కడి పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై పశ్చిమాఫ్రికా దేశ అధ్యక్షుడు జూలియస్‌ మాడా బియో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మాడా బియో హామీ ఇచ్చారు.
Next Story
Share it