ఢాకాలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

At least 7 dead in Bangladesh blast. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘ‌టనలో ఏడుగురు మృతి చెందగా..

By Medi Samrat  Published on  28 Jun 2021 4:11 AM GMT
ఢాకాలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘ‌టనలో ఏడుగురు మృతి చెందగా.. మరో 50 మంది గాయపడ్డారు. వివ‌రాళ్లోకెళితే.. ఢాకాలోని మొగ్ బజార్ వైర్ లేస్ గేట్ వద్ద ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంత‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఏడు భవనాలు, ఓ బస్సు తీవ్రంగా ధ్వంసమయ్యాయ‌ని స్థానిక మీడియా వెల్ల‌డించింది. అయితే.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు మృతి చెంద‌గా.. 50 మంది గాయ‌ప‌డ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. పేలుడు భవనం ముందు నుంచి ఓ గ్యాస్ లైన్ పైప్ ఉంది. అక్కడే కొన్ని రోజులుగా కన్‌స్ట్రక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్క‌డేమైనా గ్యాస్ పైప్ లీకయిందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ ఘటనపై విచారణకు ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక బృందాన్ని నియమించింది.

ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఢాకా పోలీస్‌ కమిషనర్ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ.. పేలుడుకు గ‌ల‌ కారణాలు తెలియ‌లేద‌ని.. గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఉగ్రకోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.



Next Story