కెమికల్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 35 మంది దుర్మరణం, 450 మందికి పైగా గాయాలు
At least 34 killed and scores injured in Bangladesh depot fire. ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని ప్రైవేట్ కెమికల్ కంటైనర్ డిపోలో సంభవించిన పేలుడు
By Medi Samrat Published on 5 Jun 2022 2:26 PM ISTఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని ప్రైవేట్ కెమికల్ కంటైనర్ డిపోలో సంభవించిన పేలుడు కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 35 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 450 మందికి పైగా గాయపడినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. చిట్టగాంగ్‌లోని సీతాకుండ ఉపజిల్లాలోని కడమ్‌రాసుల్ ప్రాంతంలో శనివారం రాత్రి బీఎం కంటైనర్ డిపోలో మంటలు చెలరేగాయి.
ఇప్పటివరకు 35 మృతదేహాలు ఇక్కడ మార్చురీకి చేరుకున్నాయని ప్రభుత్వ ఛత్తాగ్రామ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (CMCH) వద్ద ఉన్న పోలీసు అధికారి వార్తా ప్రతినిధులతో చెప్పారు. ఈ ఘటనలో 450 మందికి పైగా గాయపడ్డారు, కనీసం 350 మంది CMCH వద్ద ఉన్నారు, "అని చిట్టగాంగ్‌లోని హెల్త్ & సర్వీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇస్తాకుల్ ఇస్లాం చెప్పినట్లు ఢాకా ట్రిబ్యూన్ పేర్కొంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
చటోగ్రామ్ డివిజనల్ కమిషనర్ (DC) అష్రఫ్ ఉద్దీన్ మాట్లాడుతూ.. DC కార్యాలయం ద్వారా మరణించిన వారి కుటుంబాలకు USD 560 (టాకా 50,000) ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే.. గాయపడిన వారి కుటుంబాలకు $224 (టాకా 20,000) ఇస్తున్నట్లు డైలీ స్టార్ నివేదించింది.
ప్రధాన మంత్రి షేక్ హసీనా ప్రజల మరణానికి సంతాపం తెలిపారు. నష్ట నివారణ చర్యలకు అన్ని సౌకర్యాలను సమీకరించాలని ఆదేశించారు. మరో మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కోరుతూ ఉన్నతాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కంటైనర్ డిపోలో మంటలు చెలరేగాయని సీఎంసీహెచ్ పోలీస్ అవుట్‌పోస్ట్ సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) నూరుల్ ఆలం తెలిపారు. రసాయనాల కారణంగా కంటైనర్ డిపోలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు నూరుల్ తెలిపారు.
రాత్రి 11:45 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించగా.. కంటైనర్‌లో రసాయనాలు ఉండటంతో మంటలు ఒక కంటైనర్ నుండి మరొక కంటైనర్‌కు వ్యాపించాయి. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు వణికిపోయాయి. సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు పగిలిపోయాయని నివేదిక పేర్కొంది. పేలుడు తీవ్రత 4 కిలోమీటర్ల కు ఉందని అధికారులు తెలిపారు.