క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు.. కారణం మాత్రం..

Afghanistan taliban behead junior volleyball player ఆప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. రోజు రోజుకు వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాలిబన్ల రాక్షస పాలనకు

By అంజి  Published on  20 Oct 2021 11:18 AM GMT
క్రీడాకారిణి తల నరికిన తాలిబన్లు.. కారణం మాత్రం..

ఆప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతోంది. రోజు రోజుకు వారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. తాలిబన్ల రాక్షస పాలనకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాలిబన్ల ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్న.. తమ దారి తమదే అన్నట్లు చెలరేగిపోతున్నారు. ఆప్ఘాన్‌ మహిళల జాతీయ వాలీబాల్‌ క్రీడాకారిణిని తల నరికి చంపినట్లు ఆ జుట్టు కోచ్‌ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపారు. ఈ దారుణానికి గల కారణాలను మాత్రం ఆమె చెప్పలేదు. క్రీడాకారిణిని మహబబిన్‌ హకీమిని అక్టోబర్‌ నెలలో తాలిబన్లు అతి కిరాతంగా తల నరికి చంపారని కోచ్‌ తెలిపింది. ఈ విషయాన్ని బయటికి చెప్పొద్దని క్రీడాకారిణి తల్లిదండ్రులను తాలిబన్లు బెదిరించారని చెప్పింది. అందుకే తాను ఈ విషయాన్ని బయటి చెప్పలేకపోయినట్లు కోచ్‌ తెలిపింది.

అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పాలనలో మహబజిన్‌ కాబూల్‌ మున్సిపాలిటీ వాలీబాల్‌ క్లబ్‌ తరఫున ఆడేదని తెలిపింది. క్లబ్‌ స్టార్‌ ఆటగాళ్లలో ఆమె ఒకరని పేర్కొంది. ఆప్ఘాన్‌ దేశం తాలిబన్ల నియంత్రణలోకి రాకముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు దేశం దాటి తప్పించుకోగలిగారని చెప్పింది. మిగిలిన ఆటగాళ్లు, మహిళా అథ్లెట్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని కోచ్‌ వెల్లడించారు. చాలా మంది క్రీడాకారులు అండర్‌గ్రౌండ్‌లో జీవిస్తున్నట్లు కోచ్‌ చెప్పుకొచ్చింది. ఇటీవల ఫిఫా, ఖాతర్‌ ప్రభుత్వాలు ఆప్గాన్‌ నుంచి 100 మంది మహిళా ఫుట్‌బాల్‌ క్రీడారులను ఆ దేశం నుంచి తరలించారు. తాలిబన్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుండి క్రీడలు, రాజకీయ, సామాజిక రంగాల్లో మహిళల కార్యకలాపాలు ఆగిపోయాయి.

Next Story