ఢాకాలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 100 మందికి గాయాలు

8 killed, nearly 100 injured in explosion in Bangladesh’s Dhaka. బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలో జరిగిన పేలుడు

By Medi Samrat  Published on  7 March 2023 6:47 PM IST
ఢాకాలో భారీ పేలుడు.. 8 మంది మృతి, 100 మందికి గాయాలు

Explosion in Bangladesh’s Dhaka


బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని గులిస్థాన్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది మరణించగా.. దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 11 అగ్నిమాపక సేవల యూనిట్లు అత్యవసర సేవ‌ల నిమిత్తం ప్ర‌మాదం జ‌రిగిన‌ ప్రదేశానికి చేరుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో గాయపడిన క్ష‌త‌గాత్రుల‌ను ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రద్దీగా ఉండే సిద్దిక్ బజార్‌లో ఉన్న ఈ భవనంలో.. అనేక కార్యాలయాలు, దుకాణాలు ఉన్నాయి. ఏడు అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో శానిటేషన్ మెటీరియల్స్ విక్రయించే దుకాణంలో పేలుడు జరిగినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story