జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
జపాన్‌లోని క్యుషు ద్వీపంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 13 Jan 2025 7:06 PM ISTజపాన్‌లోని క్యుషు ద్వీపంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తర్వాత జపాన్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సంభవించిన రెండో భారీ భూకంపం ఇది. గతంలో టిబెట్‌లో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. నైరుతి జపాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.9. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
దేశ వాతావరణ సంస్థ ప్రకారం.. ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం క్యూషులోని నైరుతి ద్వీపం. ఈ ద్వీపంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్‌లో తరచుగా భూకంపాలు వస్తుంటాయి.
అంతకుముందు జనవరి 7న టిబెట్‌లో భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 126 మంది చనిపోయారు. దాదాపు 188 మంది గాయపడ్డారు. 30 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒక్క షిగాట్సేలోనే 3 వేల 609 భవనాలు కూలిపోయాయి. టిబెట్‌లోని డింగ్రీ కౌంటీలో ఈ భూకంపం సంభవించింది. టిబెట్ భూకంపంలో వందలాది మందిప్రాణాలు కోల్పోవడమే కాకుండా మౌలిక సదుపాయాలను కూడా నాశనం చేసింది.