ఫేస్‌మాస్క్‌లు దొంగిలించిన కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు

6 Jailed for Stealing Face Masks. ఫేస్‌మాస్క్‌లు దొంగిలించిన కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది.

By Medi Samrat  Published on  21 Nov 2020 10:30 AM IST
ఫేస్‌మాస్క్‌లు దొంగిలించిన కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు

ఫేస్‌మాస్క్‌లు దొంగిలించిన కేసులో దుబాయి కోర్టు సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. నిందితుల‌కు మూడేళ్ల జైలుశిక్ష, 1.5 దిర్హామ్‌ల జరిమాన, అలాగే.. జైలు జీవితం అనంత‌రం తర్వాత నిందితుల‌ను దేశం నుంచి బహిష్కరించనున్నట్టు కోర్టు తీర్పు చెప్పింది. వివ‌రాళ్లోకెళితే.. జూన్ 18న దుబాయిలో నివసిస్తున్న ఆరుగురు పాకిస్థానీలు ఓ వేర్‌హౌస్‌లోకి అక్రమంగా ప్రవేశించి 1.5 లక్షల దిర్హామ్‌లు(రూ. 30.28 లక్షలు) విలువ చేసే 156 బాక్సుల ఫేస్‌మాస్క్‌లను దొంగిలించారు.

అయితే.. అదే వేర్‌హౌస్‌లో పనిచేస్తున్న చైనాకు చెందిన ఉద్యోగి దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు కొద్ది రోజుల్లోనే ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు తాము దొంగిలించిన మాస్క్‌లను బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తికి అమ్మినట్టు అంగీకరించారు.

ఇక‌ ఈ కేసు విష‌య‌మై జూన్ నుండి కోర్టులో విచారణ జరుగుతుండ‌గా.. తాజాగా కోర్టు నిందితులకు మూడేళ్ల జైలుశిక్ష, 1.5 దిర్హామ్‌ల జరిమాన, మూడేళ్ల జైలు జీవితం అనంత‌రం దేశం నుంచి బహిష్కరించనున్నట్టు కోర్టు సంచ‌ల‌న తీర్పును వెల్ల‌డించింది.


Next Story