ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూప్ర‌కంప‌న‌లు

4.3 magnitude earthquake hits Afghanistan's Fayzabad. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం

By Medi Samrat  Published on  13 Feb 2023 10:06 AM IST
ఆఫ్ఘనిస్తాన్‌లో 4.3 తీవ్రతతో భూప్ర‌కంప‌న‌లు
ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈశాన్య నగరమైన ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ప్రకంపనలు ఉదయం 6:47 గంటలకు రాగా.. భూకంప కేంద్రం 135 కిమీ లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నేర్కొంది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి నివేదికలు అందలేదని ఎన్‌సీఎస్ పేర్కొంది.


ఇదిలావుంటే.. వ‌రుస భూ ప్ర‌కంప‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. సిక్కింలో సోమ‌వారం తెల్ల‌వారుజామున 4.15 గంట‌ల స‌మ‌యంలో యుక్సోమ్ పట్టణంలో భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.3గా న‌మోదైంది. వారం రోజుల క్రితం తుర్కియే, సిరియాలో భూ కంపం సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. ఇంకా స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతుండ‌గా మ‌రోసారి అక్క‌డ భూమి కంపించింది. ఆదివారం తుర్కియే దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో భూ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.7గా న‌మోదైంది. అస్సాంలో ఆదివారం భూకంపం సంభవించింది. సాయంత్రం 4.18 గంటలకు రాష్ట్రంలోని నాగోన్‌లో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప‌ తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0 న‌మోద‌యిన‌ట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది.


Next Story