కుప్పకూలిన హెలికాప్టర్.. నలుగురు దుర్మరణం
4 killed in helicopter crash in remote California region. ఉత్తర కాలిఫోర్నియాలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు
By Medi Samrat Published on
2 Aug 2021 3:50 AM GMT

ఉత్తర కాలిఫోర్నియాలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. దీంతో అక్కడ విషాదం నెలకొంది. ఆదివారం ఘటన చోటు చేసుకుందని.. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని కేఎస్‌టీవీ స్టేషన్ డిపార్ట్‌మెంట్ ధ్రువీకరించింది. ది రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ మధ్యాహ్నం 1.15 ఆ సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన ఉన్న కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది.
ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటనను విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారని తెలుస్తోందని అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు దర్యాప్తు చేస్తున్నది.
Next Story