వాయువ్య పాకిస్థాన్‌లోని రాడికల్ ఇస్లామిక్ పార్టీ రాజకీయ సమావేశంలో ఆదివారం జరిగిన బాంబు పేలుడులో కనీసం 39 మంది మరణించగా.. డజన్ల కొద్దీ వ్యక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాంబు పేలుడు ఘటనలో ఆసుపత్రిలో 39 మృతదేహాలు ఉన్నాయని నేను ధృవీకరించగలను. 123 మంది గాయపడ్డారు. ఇందులో 17 మంది పరిస్థితి విషమంగా ఉంది అని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ ఆరోగ్య మంత్రి రియాజ్ అన్వర్ AFP కి చెప్పారు. ప్రావిన్షియల్ గవర్నర్ హాజీ గులాం అలీ కూడా AFPతో మాట్లాడుతూ మరణాల సంఖ్యను ధృవీకరించారు.
సమావేశంలో పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు వేడుకలో ప్రసంగించవలసి ఉంది. కానీ ఆ నాయకుడు రాకముందే బాంబు పేలుడు సంభవించిందని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ గండాపూర్ AFP కి చెప్పారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని ఖార్ పట్టణంలో సమావేశాన్ని నిర్వహిస్తున్న జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్) పార్టీ లక్ష్యంగా పేలుడు జరిగిందని ఆయన చెప్పారు.