జ‌నాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి

చైనాలోని జుహైలో సోమవారం సాయంత్రం స్పోర్ట్స్ సెంటర్ వెలుపల ఉన్న వ్యక్తుల గుంపుపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా.. 43 మంది గాయపడ్డారు

By Medi Samrat  Published on  12 Nov 2024 6:12 PM IST
జ‌నాలను గుద్దుతూ దూసుకెళ్లిన కారు.. 35 మంది మృతి

చైనాలోని జుహైలో సోమవారం సాయంత్రం స్పోర్ట్స్ సెంటర్ వెలుపల ఉన్న వ్యక్తుల గుంపుపైకి కారు దూసుకెళ్లడంతో 35 మంది మృతి చెందగా.. 43 మంది గాయపడ్డారు. చైనాలోని జుహై నగరంలో కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హామీ ఇచ్చారు.

జుహై నగరంలో కారు డ్రైవర్ జనంపైకి దూసుకెళ్లడంతో 35 మంది మరణించారని.. 43 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 62 ఏళ్ల డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. అయితే ఇది దాడి లేదా ప్రమాదమా అనేది వెంటనే తెలియరాలేదు. దీని ఎలాంటి ఉద్దేశ్యం లేదని.. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం వాహనం పలువురు పాదచారులను ఢీకొట్టిందని పోలీసు ప్రకటన తెలిపింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించారు.

అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా నేరస్థుడిని చట్ట ప్రకారం శిక్షించాలని కోరినట్లు జిన్హువా నివేదించింది. ఈ సంఘటనకు సంబంధించి రోడ్డుపై పడి ఉన్న మృతదేహాలు, సహాయం కోసం కేకలు వేస్తున్నట్లు చూపుతున్న వీడియోలు ట్విట‌ర్‌లో త్వరగా వైరల్ అవుతున్నాయి.

అధ్యక్షుడు జి జిన్‌పింగ్ క్షతగాత్రులకు చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దోషిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ విషయంపై మార్గనిర్దేశం చేసేందుకు చైనా ప్రభుత్వం ఒక బృందాన్ని పంపింది. గట్టి భద్రత, కఠినమైన చట్టాల కారణంగా చైనాలో హింసాత్మక నేరాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ పెద్ద నగరాల్లో ప‌లు ఘ‌ట‌న‌లు బహిరంగ ప్రదేశాల్లో భద్రతపై ప్రజల దృష్టిని ఆకర్షించాయి.

Next Story