3 dead in Copenhagen shopping mall shooting. డెన్మార్క్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్‌లో ఒకటైన కోపెన్‌హాగన్ షాపింగ్ మాల్‌లో జరిగిన
By Medi Samrat Published on 4 July 2022 3:51 AM GMT
డెన్మార్క్‌లోని అతిపెద్ద షాపింగ్ మాల్‌లో ఒకటైన కోపెన్‌హాగన్ షాపింగ్ మాల్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు, పోలీసులు సోమవారం కాల్పుల ఘటనను ధృవీకరించారు.
అమేగర్ జిల్లాలో ఉన్న ఫీల్డ్స్ షాపింగ్ సెంటర్‌లో జరిగిన కాల్పుల్లో "40 ఏళ్ల వ్యక్తితో సహా ఇద్దరు యువకులు మరణించారు" అని కోపెన్‌హాగన్ చీఫ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సోరెన్ థామస్సేన్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఆదివారం సాయంత్రం 5.35 గంటల ప్రాంతంలో సంఘటనకు సంబంధించి పోలీసులకు కాల్ వచ్చింది. సాయంత్రం 5.48 గంటలకు షాపింగ్ మాల్ వెలుపల రైఫిల్, మందుగుండు సామగ్రిని కలిగి ఉన్న 22 ఏళ్ల డానిష్ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. నిందితుడిని సోమవారం న్యాయమూర్తి విచారించనున్నారు. డెన్మార్క్ లో క్రూరమైన దాడి జరిగిందని ప్రధాన మంత్రి ఫ్రెడరిక్‌సెన్ అన్నారు.
"డెన్మార్క్ లో ఆదివారం రాత్రి క్రూరమైన దాడి జరిగింది.. అనేకమంది చనిపోయారు. మరింత మంది గాయపడ్డారు. షాపింగ్ కు వచ్చిన అమాయక కుటుంబాలు. పిల్లలు, యుక్తవయస్కులు, పెద్దలు ఇందులో ఉన్నారని పేర్కొన్నారు. విషాదంలో ఉన్న చనిపోయిన కుటుంబాల బంధువులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.