పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన బాలిక‌

10Year Girl gives birth. మ‌హిళ‌ల‌పై రోజు రోజు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు మృగాళ్లు.

By Medi Samrat  Published on  19 Dec 2020 5:47 AM GMT
పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చిన బాలిక‌

మ‌హిళ‌ల‌పై రోజు రోజు ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నారుల‌ను కూడా వ‌ద‌ల‌డం లేదు మృగాళ్లు. ఆడుతూ.. పాడుతూ బాల్యాన్ని గ‌డ‌పాల్సిన ఆ చిన్నారి.. ప‌దేళ్ల వ‌య‌సులోనే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌న‌పై ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టిన ఆ వ్యక్తి ఎవ‌రో అన్న సంగ‌తిని కూడా చెప్ప‌లేక‌పోతుంది. గ‌త 26 రోజులుగా ఆ ప‌సిగుడ్డ‌ను కాపాడుకుంటూ వ‌స్తుంది. ఈ దారుణ ఘ‌ట‌న కొలంబియా దేశంలో జ‌రిగింది.

కొలంబియాలోని ప్రాడో మునిసిపాలిటిలో ఓ పదేళ్ల బాలిక గర్భం దాల్చి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విష‌యం ఆల‌స్యంగా అధికారుల‌కు తెలియ‌డంతో.. ఇబాకో న‌గ‌రంలోని మెడిక‌ల్ కేర్ సెంట‌ర్‌లో ఉంచి ఆ త‌ల్లి బిడ్డ‌ల‌ను సంర‌క్షిస్తున్నారు. ఆ బాలికకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమెపై లైంగిక దాడి ప్రారంభమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కొలంబియా వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.

తొలిమా గ‌వ‌ర్న‌ర్‌ రికార్డో ఒరోజ్కో మీడియాతో మాట్లాడాడు. బాలిక బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిందన్నారు. ఈ ఘ‌ట‌న‌పై బాలిక ఏం చెప్ప‌లేక‌పోతుంది. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించామ‌న్నారు. ఇద్దరు వ్యక్తులను అనుమానిస్తున్నామని తెలిపారు. ఆ బాలిక సవతి తండ్రి(43), పొలాల్లో పని చేసే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Next Story