అమెరికాలో మరోమారు కాల్పులు..

10 people killed in Colorado supermarket shooting. అగ్ర‌రాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కొలరాడోలోని బౌల్డర్‌ నగరంలోని కింగ్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద ఒక స్టోర్‌లో

By Medi Samrat
Published on : 23 March 2021 10:06 AM IST

10 people killed in Colorado supermarket shooting

వారం రోజుల క్రితం జ‌రిగిన కాల్పుల ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే.. అగ్ర‌రాజ్యం అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటు చేసుకుంది. కొలరాడోలోని బౌల్డర్‌ నగరంలోని కింగ్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద ఒక స్టోర్‌లో ఓ దుండ‌గుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్‌ అధికారి సహా పది మంది మృతిచెందారు.


వివ‌రాళ్లోకెళితే.. బౌల్డర్ సిటీలోని కింగ్‌ సూపర్‌ మార్కెట్ వ‌ద్ద ఓ స్టోర్‌లోకి దుండ‌గుడు చొరబడి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌దిమంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కోన్నారు. అలాగే ప‌లువురికి గాయాలవ‌గా.. వారిని హాస్పిట‌ల్‌కు తరలించామని చెప్పారు. అయితే.. స‌మాచారం మేర‌కు ఘటనాస్థలికి భారీగా చేరుకున్న భద్రతా బలగాలు‌ స్టోర్‌ను చుట్టుముట్టాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. అయితే, దుండ‌గుడు ఎందుకు కాల్పులకు పాల్ప‌డ్డాడ‌నేది తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే.. స‌రిగ్గా వారం క్రితం అమెరికాలో ఓ దుండ‌గుడు దారుణానికి ఒడిగ‌ట్టాడు. అట్లాంటాలోని మసాజ్‌ పార్లర్ల‌లో కాల్పులు జరుపడంతో ఎనిమిది మంది మృతిచెందారు. అందులో ఏడుగురు మహిళలు ఉండ‌గా.. ఆరుగురు ఆసియన్లుగా పోలీసులు గుర్తించారు. కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ‌ దుండ‌గుడిని వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్డ్‌ ఆరోన్‌లాంగ్ గా గుర్తించిన‌ట్లు పోలీసులు పేర్కోన్నారు.


Next Story