ఇమ్రాన్ ఖాన్ కు అలా షాక్ ఇచ్చిన భారత్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Sept 2020 5:46 PM ISTఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతైనా పాక్ ప్రభుత్వంలో మార్పులు వస్తాయని భావించినప్పటికీ అది చోటు చేసుకోలేదు. ఎప్పుడు చూసినా భారత్ మీద అక్కసును వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నాడు. తీవ్ర వాదులకు తన మద్దతు ఉండనే ఉందని తన చర్యల ద్వారా చేసి చూపించాడు. మార్పు తీసుకుని వస్తానని చెప్పిన వ్యక్తి తీవ్రవాదులకు వత్తాసు పలికేలా మారిపోయాడు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడు.
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ఉపన్యాసం ప్రారంభం అయిన వెంటనే భారత ప్రతినిధి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్ నుంచి వాకౌట్ చేశారు.
ఈ సమావేశానికి వర్చువల్‌గా హాజరైన ఇమ్రాన్, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడమే కాక కశ్మీర్ సమస్యను లేవనెత్తాడు. దీంతో భారత దౌత్యవేత్త మిజిటో వినిటో వాకౌట్ చేశారు. అనంతరం పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి టీఎస్ తిరుమూర్తి స్పందిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ దౌత్యపరంగా చాలా తక్కువ స్థాయి వ్యాఖ్యలు చేశారని.. పాకిస్తాన్ తన సొంత మైనారిటీలను హింసించడం గురించి, సరిహద్దు ఉగ్రవాదం గురించి దుర్మార్గపు అబద్ధాలు, వ్యక్తిగత దాడులకు దిగిందని అన్నారు.