పొగమంచుతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆలస్యం

టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్‌ ఆలస్యంగా పడనుంది.

By -  Medi Samrat
Published on : 17 Dec 2025 7:07 PM IST

పొగమంచుతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆలస్యం

టీమిండియా- సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20లో టాస్‌ ఆలస్యంగా పడనుంది. లక్నోలో పొగమంచు అధికంగా ఉన్న నేపథ్యంలో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరిగి 6.50 నిమిషాలకు మరోసారి పరిస్థితిని సమీక్షించారు. దీంతో 7.30 నిమిషాలకు మరోసారి రివ్యూ చేయనున్నారు. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన జస్‌ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. శుభ్‌మన్ గిల్‌ పాదం గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దాంతో మూడు మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన సంజూ శాంసన్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.

సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో కొనసాగుతున్న భారత జట్టు సిరీస్ ను సొంతం చేసుకోడానికి సిద్ధమైంది. ధర్మశాలలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన టీమిండియా లక్నో ఏక్‌నా స్టేడియంలో విజయంపై గురి పెట్టింది.

Next Story