భార‌త్‌లో క‌రోనా క‌రాళ‌నృత్యం.. 24గంట‌ల్లో 8,392కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2020 10:22 AM IST
భార‌త్‌లో క‌రోనా క‌రాళ‌నృత్యం.. 24గంట‌ల్లో 8,392కేసులు

భారత్‌లో క‌రోనా ప్ర‌ళ‌య‌తాండ‌వం కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 8392 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 230 మృతి చెందార‌ని కేంద్ర‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. క‌రోనా మ‌హ‌మ్మారి భార‌త్‌లో విజృంభ‌ణ మొద‌లైన త‌రువాత ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. వీటితో క‌లిపి దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 1,90,535 కి చేరింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 5,394 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 91,819 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి కాగా.. 93,322 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. ఆ త‌రువాత త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, ఢిల్లీలో భారీగా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక ప్ర‌పంచంలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదు అవుతున్న దేశాల్లో భార‌త్ 7వ స్థానానికి చేరింది. మ‌ర‌ణాల్లో 13వ స్థానంలో ఉంది. లాక్‌డౌన్ 5.0లో భారీగా స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో కేసులు పెరిగే అవ‌కాశం ఉంది.

Next Story