సెల్ఫీ విత్ ఫ్లాగ్.. ఇక మొదలుపెడదామా

కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది.

By Medi Samrat  Published on  12 Aug 2023 2:14 PM IST
సెల్ఫీ విత్ ఫ్లాగ్.. ఇక మొదలుపెడదామా

కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా' పేరుతో ఆగస్టు 13, 14వ తేదీల్లో పౌరులు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలు, స్టేటస్‌లలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రతి భారతీయుడికి త్రివర్ణ పతాకంతో భావోద్వేగ అనుబంధం ఉందిని.. ఇది దేశ ప్రగతికి మరింత కష్టపడి పనిచేయడానికి స్ఫూర్తినిస్తుందన్నారు. ఆగస్టు 13 నుండి 15వ తేదీ మధ్య జరిగే హర్‌ఘర్‌తిరంగ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నానని మోదీ ట్వీట్ చేశారు.

ఇక హర్ ఘర్ తిరంగాలో భాగంగా.. harghartiranga.com పోర్టల్‌ను కేంద్రం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో దేశ పౌరులు తమ ఫోటోలతో పేరు నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న వారికి సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నారు. ముందుగా హర్ తిరంగ వెబ్ సైట్ https://harghartirang.com కు వెళ్లాలి. అక్కడ అప్లోడ్ సెల్ఫీ విత్ ఫ్లాగ్ అని అడుగుతుంది. అందులో మీ పేరుతో పాటుగా ఫోటోను అప్లోడ్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ వస్తుంది. ఇవన్నీ పూర్తీ చేస్తే మీకో సర్టిఫికెట్ కనిపిస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Next Story