గడిచిన 12 గంటల్లో 240 కరోనా కేసులు.. కేంద్రం అప్రమత్తం

By అంజి  Published on  1 April 2020 8:40 AM GMT
గడిచిన 12 గంటల్లో 240 కరోనా కేసులు.. కేంద్రం అప్రమత్తం

ఢిల్లీ: భారతదేశంలో మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చాప కింద నీరులా పాకుతూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గడిచిన 12 గంటల్లోనే 240 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read: ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..

బుధవారం నాటికి మన దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1637కి చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 39 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 1466 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 133 మంది కరోనా బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.



కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా మహారాష్ట్రలో కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 320కి చేరింది. 12 మంది మృతి చెందారు.

Also Read: కరోనా చేరని దూరం ఏదో తెలుసా..

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 మంది కరోనా బారినపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఒక్క సారిగా పెరగడం.. ఆ రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కసారిగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87కు చేరింది.



వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లో 83, అండమాన్‌ నికోబార్‌ దీవులు 10, బిహార్‌ 23, చండీఘడ్‌ 13, పశ్చిమబెంగాల్‌ 26, ఉత్తరాఖండ్‌ 7, ఉత్తరప్రదేశ్‌ 103, తెలంగాణ 94, తమిళనాడు 124, మిజోరం 1, ఒడిశా 4, పుదుచ్చేరి 1, పంజాబ్‌ 41, రాజస్థాన్‌ 93, ఛత్తీస్‌గఢ్‌ 9, ఢిల్లీ 120, గోవా 5, గుజరాత్‌ 74, హర్యానా 43, హిమాచల్‌ప్రదేశ్‌ 3, జమ్ము కశ్మీర్‌ 55, కర్నాటక 101, కేరళ 241, లఢఖ్‌ 13, మధ్యప్రదేశ్‌ 47, మహారాష్ట్ర 302, మణిపూర్‌ 1 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

Next Story