కరోనా చేరని దూరం ఏదో తెలుసా..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 April 2020 8:03 AM GMT
కరోనా చేరని దూరం ఏదో తెలుసా..

ప్ర‌పంచంలో ఉన్న దేశదేశానికి విస్తరిస్తుంది కరోనా. చైనా లో పుట్టి, 200కు పైగా దేశాల్లో విలయతాండవం చేస్తూ, దాదాపు 8 లక్షల మందిని తన అదుపులో పెట్టుకుంది. ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టు ఈ మహమ్మారి ప్రవేశించలేని చోటు ఏదైనా ఒకటి ఉందా? అని వెతికే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని తేల్చి చెప్పారు. కరోనా వెళ్లలేని చోటు రోదసి లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇక్కడ పని చేసే ఆస్ట్రోనాట్స్ కు కరోనా వైరస్ సోకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు.

కరోనానే కాదు దానిని మించిన ఏ మహమ్మారి అయినా ఆస్ట్రోనాట్స్ కు సోకకుండా ఎన్నో జాగ్రత్తలు, క్వారంటైన్ విధానాలను అమలు చేస్తామని, అంతే కాదు వారితో సమన్వయం చేసుకునే ప్రతి ఒక్కరి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ తగు చర్యలు తీసుకుంటామన్నారు.

రష్యాన్ న్యూస్ ఏజన్సీ 'స్పుత్నిక్'కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇంటర్నేషనల్ ఎస్ఓఎస్ లో రిజిస్టర్డ్ నర్స్ ఒకరు తెలియచేసారు. ఆస్ట్రోనాట్ల ఆరోగ్యం, భద్రతకు ఎప్పటినుంచో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఏ వ్యాధికూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం లేదని, హెల్త్ స్టెబిలైజేషన్ కార్యక్రమం ఎన్నో ఏళ్లుగా అత్యుత్తమంగా కొనసాగుతోందని అన్నారు. సుమారు దశాబ్దకాలంగా నాసాతో సమన్వయం చేసుకుంటూ ఆస్ట్రోనాట్స్ కు క్లినికల్ సేవలను ఆమె అందిస్తున్నారు.అసలు సాధారణ పరిస్థితుల్లో కూడా వ్యోమగాములు చాలాకాలం పాటు క్వారంటైన్ లో ఉంటారని, అన్ని వైద్య పరీక్షల తరువాత మాత్రమే వారు ఐఎస్ఎస్ కు పంపబడతారని ఆమె తెలిపారు.

నాసా వ్యోమగామి క్రిస్ కాసిడీ మరియు రష్యన్ వ్యోమగాములు నికోలాయ్ టిఖోనోవ్ మరియు ఆండ్రీ బాబ్కిన్ ఏప్రిల్ 9 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కోసం ప్రయోగించే అవకాశం ఉంది. వీరికి స్టిములేషన్ జరుగుతోందని నాసా ప్రకటించింది.

ప్రస్తుత మహమ్మారి కారణంగా వ్యోమగాములు మామూలు కంటే ముందుగానే తమ నిర్బంధాన్ని ప్రారంభించారు. వ్యోమగాములు ISS కు అనారోగ్యం కలిగించకుండా చూసే ఇతర విధానాలు కూడా US అంతరిక్ష సంస్థలో చెబుతున్నారు. వ్యోమగాములు అంతరిక్షంలోకి ప్రవేశించే ముందు రెండు వారాల పాటు నిర్బంధంలో ఉండాలని నాసా ఆదేశించింది.

Next Story