భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర

By సుభాష్  Published on  1 April 2020 8:16 AM GMT
భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర

దేశంలో కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఒక విధంగా లాక్‌డౌన్‌ కారణంగా సామాన్యులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటకు రాకుండా లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎల్పీజీ సిలిండర్‌ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గృహ అవసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధరపై రూ.65 వరకు అన్ని మెట్రో నగరాల్లో తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరపై 61.5, రూ. 62, రూ.65.5, మేరకు తగ్గించింది. దీంతో ఢిల్లీలో రూ.744, ముంబైలో రూ. 714, చెన్నైలో రూ. 761.5, కోల్‌కతాలో రూ. 774.5 ధరలు అమలవుతున్నాయి. అయితే కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు యధాతధంగా ఉన్నాయి.

Next Story
Share it