టాటా స్కై వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. త్వరలో తన బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారులకు ఉచితంగా ల్యాండ్‌ లైన్‌ సర్వీసులను అందించనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది. ఈమేరకు కంపెనీ అధికారిక వెబ్‌ సైట్‌లో పోస్టర్‌ ద్వారా ప్రకటించింది. ఇప్పటి బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీసుల ద్వారా ల్యాండ్‌ లైన్‌ సౌకర్యం అందిస్తున్న జియో ఫైబర్‌, ఎయిర్‌ టెట్‌ బ్రాండ్లతో పోటీ పడాలనే ఉద్దేశంతో టాటా స్కై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, టాటా స్కై తన అన్‌ లిమిటెడ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలతో పాటు అన్‌ లిమిటెఎడ్‌ వాయిస్‌ కాలింగ్‌ను కూడా అందించనుంది. అన్‌ లిమిటెడ్‌ హైస్పీడ్‌ డేటా లాభాలను కూడా అందించే టాటా స్కై .. బ్రాడ్‌ బ్యాండ్‌ ప్లాన్లు రూ. 900 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.. దీని ద్వారా అపరిమిత కాలింగ్‌ ఈ ల్యాండ్‌ లైన్‌ సర్వీస్‌లో అందిస్తున్నారని తెలుసుకోవచ్చు.

ఈ ఉచిత ల్యాండ్‌ లైన్‌ సర్వీసుల గురించి ఎటువంటి వివరాలనూ తెలుపలేదు. దీనికి స్టీమ్‌ అన్‌ లిమిటెడ్‌, కాల్‌ అన్‌ లిమిటెడ్‌ అనే ట్యాగ్‌లైన్‌ను కూడా అందించింది. అయితే ఈ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో తెలుపలేదు.

ప్రస్తుతం టాటా స్కై బ్రాడ్‌ బ్యాండ్‌..

ప్రస్తుతం టాటా స్కై బ్రాడ్‌ బ్యాండ్‌లో మూడు అన్‌ లిమిటెడ్‌ నెలవారి ప్లాన్లను అందిస్తోంది. వీటిలో ప్రారంభ ప్లాన్‌ రూ. 900 కాగా, హైఎండ్‌ ప్లాన్‌ రూ. 1,100గా ఉంది. 100 ఎంబీపీఎస్‌ వరకు ఇంటర్నెట్‌ను ఇందులో అందించనుంది. ఒకేసారి మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాలానికి ముందుగానే రెంటల్‌ అడ్వాన్స్‌ కట్టడం ద్వారా వినియోగదారులు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

కాగా, వినియోగదారులకు ఉచితంగా బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అందించే మొదటి నెట్‌ వర్క్‌ టాటా స్కై కాదు. ఎయిర్‌ టెల్‌, జియో ఇప్పటికే ఇలంటి సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ టెల్‌, యాక్ట్‌ ఫైబర్‌ నెట్‌ వంటి ప్రముఖ కంపెనీల నుంచి పోటీని తట్టుకోవడంలో టాటా స్కై ఈ సేవలు అందించే అవకాశం కనిపిస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.