ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..

By రాణి  Published on  1 April 2020 8:28 AM GMT
ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..

మహమ్మారి 200 దేశాల ప్రజలను గడగడలాడిస్తోంది. బుధవారానికి దేశ వ్యాప్తంగా 1700 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాలో 87 కేసులు, తెలంగాణలో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..ఆపరేషన్ నిజాముద్దీన్ కొనసాగుతోంది. నిజాముద్దీన్ వెళ్లొచ్చిన వారి వల్ల ఇంకా ఎంతమందికి కరోనా సోకి ఉంటుందోనని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వైరస్ పై అవగాహన కల్పిస్తూ ఇప్పటి వరకూ మూడు పాటలొచ్చాయి. ఒకటి..''చేతులెత్తి మొక్కుతా..చేయిచేయి కలపకురా, కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా'', రెండోది సంగీత దర్శకుడు కోటి సారథ్యంలో టాలీవుడ్ అగ్ర హీరోలు పాడిన పాట. మూడోది వందే మాతరం శ్రీనివాస్ పాడిన '' కరోనా..కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూ భాగాన, కరోనా..కరోనా నిన్ను మట్టి కరిపిస్తాం..130 కోట్ల జనం సరేనా, మా ఇంట్లో మేముంటాం..నీ కంట్లో కంపగొడతాం. మేము కాళ్లు బయటపెట్టం..నీ కాళ్లను నరికేస్తాం..'' అన్న పాట.

Also Read : చైనా డ్రాగన్ ప్లాన్..వైరస్ తో వ్యాపారం

కాగా..కరోనా పై ఇప్పటికే సరిలేవు నీకెవ్వరు సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ ను పేరడిగా మార్చేయగా..అది నెట్టింట్లో బాగా వైరల్ అయింది. తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలోని ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి అన్న పాటను..కరోనా పేరడి సాంగ్ గా పాడారు. కరోనా వైరస్ నుంచి తప్పించుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కీరవాణి ఈ పాట రూపంలో ప్రజలకు తెలిపారు. '' ఓ మై డియర్ గాళ్స్.. డియర్ బాయ్స్..డియర్ మేడమ్స్..భారతీయులారా..ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి..ఇక్కడే చేరింది మహమ్మారి రోగమొక్కటి..'' అని కీరవాణి పాడిన ఈ పేరడి సాంగ్ బాగా వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి వినేయండి.

Next Story
Share it