చైనా డ్రాగన్ ప్లాన్..వైరస్ తో వ్యాపారం

By రాణి  Published on  1 April 2020 7:30 AM GMT
చైనా డ్రాగన్ ప్లాన్..వైరస్ తో వ్యాపారం

కరోనా..ఒక్క చైనా తప్ప ప్రపంచ దేశాలన్నీ ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. రోజు మొదలైనప్పటి నుంచి ముగిసే వరకూ వేల సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ఇటలీలో వైరస్ విజృభణ మొదలైందని గ్రహించాక షట్ డౌన్ ప్రకటించారు. కానీ అమెరికాలో ఇంతవరకూ ఇలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదు ప్రపంచ పెద్దన్న ట్రంప్. కారణం..దేశాన్ని లాక్ డౌన్ చేస్తే తీవ్రమైన ఆర్థిక సంక్షేభాన్ని ఎదుర్కోక తప్పదు. కానీ వైరస్ విజృంభిస్తోన్న వేళ ప్రజల ప్రాణాల కన్నా..డబ్బుకే ట్రంప్ ఎక్కువ విలువనిస్తున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి. అత్యధికంగా న్యూయార్క్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశానికి అత్యధిక ఆదాయం చేకూర్చేది కూడా న్యూయార్కే. న్యూయార్క్ ను లాక్ డౌన్ చేస్తే అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిందే.

Also Read : ఏపీలో 63కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఇప్పటికి కూడా కరోనా వైరస్ ను చైనా తయారు చేసిందేనని, వైరస్ తో చైనా ప్రపంచ దేశాలపై యుద్ధానికి సిద్ధపడిందని, దీనికి మందు కూడా చైనా కనిపెట్టిందన్న ఆరోపణలొస్తున్నాయ్. ప్రపంచ పెద్దన్న పాత్రను సొంతం చేసుకునేందుకు చైనా వైరస్ కుట్ర చేసిందా అన్న సందేహాలూ ఉన్నాయి. కానీ.. చైనా మాత్రం తాము కావాలని వైరస్ సృష్టించలేదని వాపోతోంది. వైరస్ కు మందు కూడా తాము ఇంకా కనిపెట్టలేదనే చెప్తోంది. వైరస్ మందు కనిపెట్టకుండానే చైనా కరోనా వైరస్ బారి నుంచి ఎలా కోలుకుందని ప్రశ్నిస్తే..కఠినమైన నిబంధనలు విధించడం వల్లే తమ దేశం కరోనాను జయించిందని అధ్యక్షుడు జిన్ పింగ్ చెప్తున్న సమాధానం. పైగా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన వుహాన్ లో లాక్ డౌన్ నిబంధనల్ని ఎత్తివేశారు. నిజానికి చైనాలో కరనా బారిన పడి 40 వేలకు పైగా మరణించారన్న ఆరోపణ కూడా ఉంది. కానీ ఎక్కడ తన వైఫల్యం బయటపడుతుందోనని చైనా ఈ విషయాన్ని దాచిందని, ఇందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సహకరించిందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు చైనాలో స్మశాన వాటికల్లో వేల సంఖ్యలో చితాభస్మం కుండలు మృతుల కుటుంబాలకు అందజేయడం అద్దం పడుతోంది.

Also Read : అచ్చమైన రైతులా రైతు బజార్లోకి..వెళ్లిందెవరో తెలుసా ?

ప్రస్తుతం వైరస్ నుంచి కోలుకున్న చైనా వ్యాపారాన్ని ముమ్మరం చేసింది. వైరస్ పీడిత దేశాలకు పెద్దఎత్తున మాస్క్ లు, శానిటైజర్లు, వెంటిలేటర్లు, హ్యాండ్ వాష్ లు తదితర మెడికల్ పరికరాలను సరఫరా చేసేందుకు 9000 కంపెనీల్లో తయారీలను మొదలుపెట్టింది. అమెరికా మిత్ర దేశాలన్నింటినీ తనవైపు తిప్పుకునేందుకు చైనా వైరస్ తో వ్యాపారం చేస్తోందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు ఈ విపత్తు తలెత్తినపుడు పాకిస్థాన్ తన వద్దనున్న మాస్క్ లు, శానిటైజర్లన్నింటినీ చైనాకు అందించింది. ఇప్పుడు పాకిస్థాన్ కు వైరస్ సోకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉండగా..మాస్క్ లు శానిటైజర్లు, మెడికల్ పరికరాలను అందించేందుకు ముందుకొచ్చింది. అలాగే ఇటలీ, రష్యా, ఇండోనేషియా తదితర దేశాలు సైతం చైనా సహాయాన్ని అర్థించాయి. ఈ అవకాశాన్ని చైనా ఆర్థికంగా కోలుకునేందుకు ఉపయోగించుకుంటోంది. ఆయా దేశాలకు కావాల్సిన శానిటైజర్లు, మాస్క్ లు ఇతర పరికరాలను అందించేందుకు పెద్దమొత్తంలో డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : కరోనా వైరస్‌: ఆమె త్యాగం ఎంతో గొప్పది.. కన్నీటి పర్యంతమైన వైద్యులు

మామూలుగానే చైనా ఏం చెప్పినా నమ్మని ప్రపంచ దేశాలు..కరోనా వైరస్ కు తమ వద్ద మందులేని చెప్తున్నా నమ్మట్లేదు. అమెరికా ఆర్మీతో చైనా ఆర్మీకి ప్రత్యక్ష యుద్ధం చేసేంత సమర్థత లేకనే ఈ వైరస్ ను అమెరికాకు అంటించిందని ట్రంప్ కూడా ఆరోపించారు. మార్చి 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 80 వేల కేసులుంటే..31వ తేదీకి 8 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పుట్టినిల్లైన చైనా కంటే అమెరికాలో వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంది. సుమారు 2 లక్షల కేసులు నమోదయ్యాయి అమెరికాలో. ఇక ఇటలీలో అయితే కరోనా మృత్యుఘోష రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికీ 11 వేల పై చిలుకు కరోనా బాధితులు చనిపోయారు. ఇటలీలో కరోనా కల్లోలానికి మరో కారణం అక్కడ అత్యధికంగా వృద్ధులుండటం. అమెరికాలో 4 వేలకు పైగా కరోనా బాధితులు చనిపోయారు. ఇక భారత్ లో బుధవారానికి 1600 కు పైగా కరోనా కేసులు నమోదవ్వగా 47 మంది మృతిచెందారు. తెలంగాణలో 97, ఆంధ్రప్రదేశ్ లో 87 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో బుధవారం ఒక్కరోజే 40 కి పైగా కరోనా బాధితులున్నట్లు గుర్తించారు వైద్యులు.

Next Story