ముఖ్యాంశాలు

  • ప‌క్క‌కు పెట్టిన సెల‌క్ట‌ర్లు
  • అసీస్‌తో సిరీస్‌కు దూరం

వన్డే వరల్డ్‌కప్‌లో పాక్ నాకౌట్‌కు చేరకుండా నిష్క్రమించడంతో కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై వేటు ప‌డిన విష‌యం విధిత‌మే. సర్ఫరాజ్‌ను టెస్టు, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తొలగిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఆసీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కూడా సర్ఫరాజ్‌ను ఎంపిక చేయ‌లేదు.

అయితే.. అసీస్ సిరీస్‌కు సర్పరాజ్ ను ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని సాకుగా చూపుతూ.. ఆ దేశ ప్రధాని, మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్.. సర్పరాజ్ ను దేశవాళీ క్రికెట్‌ ఆడుకోమంటూ సలహా ఇచ్చారు. ‘సర్ఫరాజ్‌ దేశవాళీ మ్యాచ్‌లపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. టీ20ల్లో ఒక ఆటగాడి ఫామ్‌ను అంచనా వేయలేం. టెస్టు, వన్డే క్రికెట్‌లలో మాత్ర‌మే ఒక ఆటగాడి ప్రదర్శన బయటకు వస్తుంది. ముందుగా సర్ఫరాజ్‌ దేశవాళీ క్రికెట్‌పై శ్ర‌ద్ధ పెట్టాలి. జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ మ్యాచ్‌ల్లో రాణించాలి. నువ్వు ఘనంగా పాకిస్తాన్‌ జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తావనే అనుకుంటున్నాని ఇమ్రాన్‌.. స‌ర్ఫ‌రాజ్ భ‌విత‌వ్యాన్ని తేల్చేశాడు.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.