జూబ్లీహిల్స్ బైపోల్‌కు రెండ్రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తాం: టీబీజేపీ చీఫ్

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తాం..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు.

By -  Knakam Karthik
Published on : 10 Oct 2025 1:30 PM IST

Hyderabad News, JublieeHills Bypoll, Bjp, TBJP chief, Congress, Brs

జూబ్లీహిల్స్ బైపోల్‌కు రెండ్రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేస్తాం: టీబీజేపీ చీఫ్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం తమ పార్టీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ఖరారు చేస్తాం..అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. గ్రేటర్ పరిధి జిల్లాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీసీలను బీఆర్ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయి. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు కూడా నిర్ణయానికి వచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనం గెలుస్తామని పూర్తి నమ్మకం ఉంది. నగరాన్ని వరల్డ్‌కే తలమానికంగా మారుస్తామని బీఆర్ఎస్ గతంలో చెప్పింది కానీ అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు పడలేదు. కాంగ్రెస్ కూడా అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చింది..కానీ మ్యాన్ హోల్స్ లో పడి, అగ్నిప్రమాదాలు జరిగి మరణిస్తూనే ఉన్నారు. ఓట్ల కోసం ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగాయి. ఎర్రగడ్డలో ప్రజలు, కాలనీల మధ్య ముస్లింలకు శ్మశాన వాటికకు ల్యాండ్ కేటాయిస్తున్నారు. ఒకవైపు జూబ్లీహిల్స్ పరిధిలో గుళ్ళు కూలగొడుతున్నారు..అని రామచందర్ రావు ఆరోపించారు.

ఈ ఉప ఎన్నికల్లో సీటు గెలిచి మోడీకి గిఫ్ట్ గా ఇవ్వాలి. రెండు మూడ్రోజుల్లో క్యాండిడేట్ ను ఫైనల్ చేస్తాం. రేపటి నుంచి అంతా జూబ్లీహిల్స్‌లో తిరిగి ప్రచారం చేయాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి రాజకీయ మార్పు చూడండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందాన్ని తిప్పికొట్టండి..అని రామచందర్ రావు కోరారు.

Next Story