హైదరాబాద్‌లో పెరుగుతున్న 'స్క్రబ్‌ టైఫస్‌' వ్యాధి బాధితులు.. ఎక్కువగా పిల్లలే.!

Victims of 'Scrub Typhus' on the rise in Hyderabad. హైదరాబాద్‌లో 'స్క్రబ్‌ టైఫస్‌' అనే వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇటీవల కాలంలో 'స్క్రబ్‌ టైఫస్‌' వ్యాధి కేసులు

By అంజి  Published on  22 Dec 2021 2:58 AM GMT
హైదరాబాద్‌లో పెరుగుతున్న స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి బాధితులు.. ఎక్కువగా పిల్లలే.!

ఇప్పటికే ఓమిక్రాన్‌ వేరియంట్‌ కేసులతో ఆందోళన చెందుతున్న హైదరాబాద్‌ ప్రజలను మరో వ్యాధి భయపెడుతోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 'స్క్రబ్‌ టైఫస్‌' అనే వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇటీవల కాలంలో 'స్క్రబ్‌ టైఫస్‌' వ్యాధి కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో గాంధీ ఆస్పత్రిలో 15 మంది 'స్క్రబ్‌ టైఫస్‌' చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. 'స్క్రబ్‌ టైఫస్‌' వ్యాధిని బుష్‌ టైఫస్‌ అని కూడా అన్నారు. అయితే ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. డిసెంబర్‌ నెలలో నలుగురు చిన్నారులు ఈ వ్యాధి బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చేరారు.

వారిలో ఇద్దరు డిశ్చార్జ్‌ కాగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి నల్లి వంటి చిన్న పురుగులు కుట్టడం ద్వారా సోకుతుంది. ఈ పురుగులు ఎక్కువగా ఇళ్లలో, పెరటి మొక్కళ్లో, చిత్తడి ప్రాంతాల్లో ఉంటాయి. తడి ప్రాంతాలతో పాటు ఇళ్లలో ఈ పురుగులు ఉంటాయి. ఎక్కువగా రాత్రి సమయాల్లో కుట్టే ఈ పురుగులు.. నల్లుల మాదిరిగా తిరుగుతుంటాయి. ఒక్కసారి ఈ పురుగులు కుట్టిన తర్వాత తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులువస్తాయి. కొందరికి శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి. ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

Next Story