అది టిఆర్ఎస్ చేస్తున్న చీప్ జిమ్మిక్కు.. వారిని చిత్తుగా ఓడించండి : ఉత్తమ్

Uttam Fire On TRS BJP. టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందాల

By Medi Samrat  Published on  1 Dec 2020 6:23 AM GMT
అది టిఆర్ఎస్ చేస్తున్న చీప్ జిమ్మిక్కు.. వారిని చిత్తుగా ఓడించండి : ఉత్తమ్

టిఆర్ఎస్, బీజేపీ పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నా పేరుతో సంచలన వ్యాఖ్యలు అంటూ టిఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్ధమ‌ని.. కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు బుద్ది చెప్పాల‌ని అన్నారు.

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ రెండు ప్రజా వ్యతిరేక పార్టీలేన‌ని.. ఆ రెండు పార్టీలను ఓడించాలని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని.. తాను టిఆర్ఎస్ కు ఓటెయ్యమని అన్నట్టు వస్తున్న ప్రచారం బూటకమ‌ని.. అది టిఆర్ఎస్ చేస్తున్న చీప్ జిమ్మిక్కు మండిప‌డ్డారు. టీఆర్ఎస్, బీజేపీ లను చిత్తుగా ఓడించండి.. బీజేపీ, టిఆర్ఎస్ లు ప్రజలకు ఏమి చేయలేక.. ఇలాంటి దొంగ నాటకాలతో కాలం గడుపుతున్నారని ఉత్తమ్ అన్నారు.


Next Story