నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 31 న కొన్ని రహదారులపై ఆంక్షలు, ఫ్లై ఓవర్లను మూసివేయడంతోపాటు ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం.. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే తేలికపాటి మోటారు వాహనాలు మినహా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు మూసివేయబడుతుంది. అదేవిధంగా పీవీఎన్ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే రాత్రి 10 నుండి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలకు మినహాయించి మూసివేయబడుతుంది.

డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, సైబర్ టవర్స్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు 1, 2, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్-జెఎన్‌టియు ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు బ్రిడ్జ్, బాబు జగ్జీవన్ బ్రిడ్జ్ వంటి అనేక ఫ్లై ఓవర్లు మూసివేయబడతాయి. రామ్ ఫ్లైఓవర్ (బాలానగర్), అన్ని వాహనాలు, పాదచారుల రాకపోకలకు పూర్తిగా మూసివేయబడుతుంది.

సైబరాబాద్ పోలీసులు జారీ చేసిన ఇతర సూచనలలో క్యాబ్‌లు/టాక్సీ/ఆటో రిక్షా ఆపరేటర్లు (కాంట్రాక్ట్ క్యారేజీలు) డ్రైవర్లు/ఆపరేటర్లు సరైన యూనిఫాంలో ఉండాలని, వారి అన్ని పత్రాలను తీసుకెళ్లాలని సూచించారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారుల్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తామని, పత్రాలు సమర్పించని పక్షంలో వాహనాలను తాత్కాలికంగా సేఫ్ కస్టడీకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకున్నప్పుడు, తదుపరి ప్రయాణానికి పౌరులు తమ స్వంత ఏర్పాట్లు చేసుకోవాలి. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై డీడీ కేసులు నమోదు చేసి నిర్ణీత సమయంలో వారందరినీ కోర్టుకు పంపుతాం అని పోలీసులు తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story