హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈనెల 28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనున్న

By Medi Samrat  Published on  25 Nov 2023 11:15 AM IST
హైదరాబాద్‌లో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈనెల 28వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ శక్తి మేరకు ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే అగ్రనేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి జాతీయ నేతలు తెలంగాణ కోసం క్యూ కడుతున్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నేడు తెలంగాణకు వస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి వస్తాయని పోలీసు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జి.సుధీర్ బాబు తెలిపారు.

ప్రధాని శనివారం సాయంత్రం 5:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. వై జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా రాజ్ భవన్ చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం 10:35 నుంచి 11:05 గంటల మధ్య రాజ్‌భవన్‌ నుంచి ఎంఎంటీఎస్‌, యశోద హాస్పిటల్‌, బేగంపేట ఫ్లైఓవర్‌ మీదుగా బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని వెళతారు. ఆ సమయాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆంక్ష‌లు వంటివి ఉంటాయని.. ప్రజలు గమనించాలని సూచించారు.

Next Story