హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణను నిస్పాక్షికంగా, పారదర్శకంగా, శాంతియుతంగా జరపడానికి భారత ఎన్నికల సంఘం ముగ్గురు సీనియర్ అధికారులను పరిశీలకులుగా నియమించింది. ఉప ఎన్నిక సాధారణ పరిశీలకులుగా IAS అధికారి రంజిత్ కుమార్ సింగ్, పోలీస్ పరిశీలకులుగా IPS అధికారి ఓం ప్రకాశ్ త్రిపాఠి, వ్యయ పరిశీలకులుగా IRS అధికారి సంజీవ్ కుమార్ లాల్ లను నియమించింది.
ఈ అధికారులు ఎన్నికల ప్రక్రియలో సాధారణ పర్యవేక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ, పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఈ పరిశీలకులు ఎన్నికల నిబంధనల అమలు, శాంతి భద్రతలు, ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ వంటి అంశాలను దగ్గరగా పర్యవేక్షిస్తారు. ఎన్నిక పూర్తి అయ్యేవరకూ వీరు అందుబాటులో ఉంటారు. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన లు,శాంతి భద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పార్టీల ప్రతినిధులు, పౌరులు పరిశీలకులకు తెలియజేయవచ్చు.