లంచం తీసుకుంటూ ఓ మహిళా ప్రభుత్వ అధికారిణి అవినీతి నిరోధక శాఖ చేతికి చిక్కిన ఘటన కూకట్‌పల్లి జోనల్ పరిధిలోని మూసాపేట సర్కిల్‌లో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ నిమిత్తం మూసాపేట సర్కిల్ ఆస్తి పన్ను విభాగంలో సీనియర్ అసిస్టెంట్ సునీతను సంప్రదించాడు. ఆమె ఆస్తి మ్యుటేషన్ పత్రాలు ఇచ్చేందుకు బాధితుడి నుండి 80 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిది. దీంతో అతడు అంతమొత్తం ఇచ్చుకోలేనని ఆమెను బ్రతిమిలాడటంతో 30 వేల రూపాయలకు తగ్గేది లేదంటి తెగేసి చెప్పింది. ఆమె వేధింపులు తట్టుకోలేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం సునీతకు బాధితుడు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. అధికారిణి నుండి 30 వేల రూపాయలు, బాధితుడి ఫైల్ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.