తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. భారీ వర్ష సూచన కారణంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా యంత్రాంగం ఆగస్టు 14 గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
"జిల్లా కలెక్టర్ మేడ్చల్-మల్కాజ్‌గిరి సూచనల మేరకు, భారీ వర్షాల కారణంగా ఆగస్టు 14న పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల అన్ని మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు సమాచారం అందింది" అని మేడ్చల్ డీఈఓ మల్కాజ్‌గిరి ఐ విజయ కుమారి తెలిపారు.