పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని పాఠశాలలలో బోధనా సమయాన్ని తగ్గించాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోయినా విద్యాసంస్థల యాజమాన్యాలు సొంతంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. మార్చి 3 నుండి, కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే క్లాస్ లు జరపనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు రంజాన్ సందర్భంగా ఒక గంట ముందుగానే కార్యాలయాలు లేదా పాఠశాలలను విడిచి వెళ్లడానికి అనుమతిని మంజూరు చేసింది. ఇది మార్చి 2 నుండి మార్చి 31, 2025 వరకు వర్తిస్తుంది. రంజాన్ మాసంలో సాయంత్రం 4 గంటలకు కార్యాలయాలు లేదా పాఠశాలలను విడిచిపెట్టడానికి ముస్లింలకు అనుమతిస్తారు. నెలవంక దర్శనం ఆధారంగా రంజాన్ నెల మార్చి 1 లేదా 2 న ప్రారంభమవుతుంది. రంజాన్ పండుగకు హైదరాబాద్ ముస్తాబవుతున్న తరుణంలో పాఠశాలల సమయాలను కూడా మార్చాలని నిర్ణయించారు.