హైదరాబాద్ పాతబస్తీలోని బాబా నగర్‌లో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలియా గార్డెన్ ఫంక్షన్ హాల్ సమీపంలో అతివేగంగా దూసుకెళ్లిన నీలిరంగు కారు, 8 సంవత్సరాల అమెర్ అలీ అనే బాలుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన బాలుడిని స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అయితే వేగంగా వచ్చిన కారు బాలుడిని ఢీకొట్టింది. దీంతో కారు కింద పడి బాలుడు నలిగిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు కారు పక్కకి జరిపి, తీవ్ర గాయాలపాలైన బాలుడిని బయటకు తీశారు. అనంతరం బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కాంచన్‌బాగ్ పోలీసులు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ వీడియో వైరల్ అవుతోంది.