ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్‌

Republic Day Celebrations At Pragathi Bhavan.ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 74వ గ‌ణ‌తంత్ర దినోవ‌త్స‌వ వేడుక‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2023 11:55 AM IST
ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జాతీయ జెండా ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్‌

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో 74వ గ‌ణ‌తంత్ర దినోవ‌త్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. భార‌త్ రాష్ట్ర స‌మితి(బీఆర్ఎస్‌) పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం గౌర‌వ వంద‌నం చేశారు. అంబేడ్కర్, మహాత్మాగాంధీ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గ‌ణతంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమ‌ర జ‌వానుల స్థూపం వ‌ద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో మంత్రులు వేముల ప్ర‌శాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నవీన్ రావు, శంభీపూర్ రాజు, మధుసూధనా చారి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story