ఆ విషయంలో ఆసక్తిలేదని తేల్చి చెప్పిన రాజా సింగ్

రాజా సింగ్.. గోషా మహల్ ఎమ్మెల్యేగా ఆయన సత్తా ఏమిటో చూపిస్తూ ఉన్నారు. అయితే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా

By Medi Samrat  Published on  8 Feb 2024 4:06 PM IST
ఆ విషయంలో ఆసక్తిలేదని తేల్చి చెప్పిన రాజా సింగ్

రాజా సింగ్.. గోషా మహల్ ఎమ్మెల్యేగా ఆయన సత్తా ఏమిటో చూపిస్తూ ఉన్నారు. అయితే ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో రాజా సింగ్ ఆ వార్తలపై స్పందించారు. తనను జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయమని బీజేపీ అధిష్టానం చెబుతూ ఉన్న విషయం నిజమేనేని అన్నారు. అయితే ఈ విషయంలో తనకు ఆసక్తిలేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 17 లోక్ సభ స్థానాలకు బలమైన అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నాలు చేస్తోంది. జహీరాబాద్ నుంచి రాజాసింగ్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.

రాజా సింగ్ మాత్రం తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలో బండి సంజయ్ కోసం తాను ప్రచారం చేస్తానన్నారు. కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్‌లో కూడా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమని రాజా సింగ్ తన మనసులోని మాటను చెప్పారు. తాను హిందూరాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలని భావిస్తున్నానన్నారు. తనకు శాసన సభా పక్ష నేత పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని... పార్టీ నుంచి గెలిచిన ఎనిమిది మందిలో ఎవరినో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా చేస్తే బాగుంటుందని.. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం చేయడం కూడా మంచిది కాదన్నారు.

Next Story