Rahul Sipligunj On Drugs Case. పబ్ లో పార్టీకి ఫ్యామిలీతో వెళ్లానని సింగర్ రాహుల్ సిప్లింగంజ్ తెలిపాడు.
By Medi Samrat Published on 3 April 2022 1:41 PM GMT
పబ్ లో పార్టీకి ఫ్యామిలీతో వెళ్లానని సింగర్ రాహుల్ సిప్లింగంజ్ తెలిపాడు. ఫ్యామిలీతో వీకెండ్ చిల్ కావడానికి వెళితే తప్పేంటని ప్రశ్నించాడు. మీడియా, వెబ్ సైట్లల్లో ఇష్టమొచ్చినట్టు రాస్తున్నారు..అడ్డంగా దొరికిపోయాడని కథనాలు వస్తున్నాయి. డ్రగ్స్ కి నాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. పోలీసుల విచారణకి పూర్తిగా సహకరిస్తానని రాహుల్ వెల్లడించాడు. ఏ విచారణకు అయినా సిద్ధంగా ఉన్నాను. నా శాంపిల్స్ ఇవ్వడానికి నేను ఎప్పుడైనా రెడీ అన్నారు. డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే ఈ సారి నేనే పట్టిస్తానన్నారు. తప్పు చేయకపోయినా నాపై వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు.
ఇదిలావుంటే.. బంజారాహిల్స్‌లో ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్‌లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్‌లో పార్టీ జరుగుతున్నదని, అందులో పాల్గొన్న పలువురు డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేశారు. పబ్‌ను సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు.