8న హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Hyderabad Tour On 8th May. కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ ఈనెల 8న హైదరాబాద్ రానున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు

By Medi Samrat
Published on : 2 May 2023 7:16 PM IST

8న హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Hyderabad Tour On 8th May


కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ ఈనెల 8న హైదరాబాద్ రానున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని నేరుగా హైదరాబాద్ కు వ‌స్తార‌ని తెలిపారు. సరూర్ నగర్‌లో జరిగే నిరుద్యోగ నిరసన కార్యక్రమంలో ప్రియాంక గాంధీ పాల్గొంటారని తెలిపారు. ఇందుకు సంబంధించి మంగ‌ళ‌వారం పీఏసీ సమావేశం జూమ్ లో చర్చించామ‌ని.. ప్రియాంక విద్యార్థులకు, నిరుద్యోగులకు అండగా ఉండనున్నారని పేర్కొన్నారు. ఈనెల 8న సాయంత్రం 4, 4:30 గంటలకు ప్రియాంక హైదరాబాద్ కు చేరుకుంటారని వెల్ల‌డించారు. ఎల్బీ నగర్ చౌరస్తాలోని శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు చేరుకొని నివాళి అర్పిస్తారు. అక్కడి నుండి సరూర్ నగర్ స్టేడియంకు ప్రియాంక పాదయాత్ర ఉంటదని తెలిపారు. సభ సక్సెస్ కోసం కమిటీలు వేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు చనిపోతున్నారని.. వారికి అండగా ఉండడానికి ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.


Next Story