రాజ్ భవన్ లో ప్రధాని మోదీ.. ఆ ప్రాంతాల్లో ఆంక్షలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేయనున్నారు.
By Medi Samrat Published on 4 March 2024 3:45 PM GMTభారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేయనున్నారు. సోమవారం ఉదయం ఆదిలాబాద్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొన్నారు. అనంతరం తమిళనాడులో బహిరంగ సభకు హాజరయ్యారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. తమిళనాడు నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. ప్రధానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రాజ్ భవన్‌కు చేరుకుంటారు. ఈరోజు అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం సంగారెడ్డికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి పఠాన్‌చెరు చేరుకొని విజయ సంకల్ప సభలో పాల్గొంటారు.
పటాన్‌చెరులో బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభ నేపథ్యంలో ఉదయం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఉదయం 9:50 నుంచి 10:15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు మార్గంలో ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.మూడంచెల భద్రతతో రెండు వేల మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. సభా స్థలికి వచ్చే వారు ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని.. కేవలం మొబైల్స్ మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు.