హైదరాబాద్‌లో 216 అడుగుల శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 11వ శతాబ్దపు భక్త సాధువు.. అందరికీ సమానత్వం అనే సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లి, జీవితంలోని అన్ని రంగాలలో సమానత్వం అనే ఆలోచనను ప్రోత్సహించిన శ్రీరామానుజాచార్యుల స్మారకార్థం ఏర్పాటుచేసిన 216 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆప్ ఈక్విటీ 'సమానత్వం యొక్క విగ్రహం'ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. మానవులందరికీ సమానత్వం అనే రామానుజాచార్య సందేశాన్ని కొనియాడిన మోదీ.. ఆయన దేశ ఐక్యత మరియు సమగ్రతకు ప్రేరణ అని అన్నారు.
శ్రీరామానుజాచార్యులు దక్షిణాదిన జన్మించినా.. ఆయన ప్రభావం దేశమంతటా వ్యాపించిందన్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ.. ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. విశ్వాసం, కులాలు మరియు మతంతో సహా అన్ని జీవన అంశాలలో సమానత్వం అనే ఆలోచనను ప్రోత్సహించిన శ్రీరామానుజాచార్యను స్మరించుకునే సమానత్వ విగ్రహం ఇదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శ్రీరామానుజాచార్య 1,000వ జయంతి సందర్భంగా 12 రోజుల పాటు జరుగుతున్న వేడుకల్లో భాగంగా ఈ విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్కరించారు.