హైదరాబాద్‌లో పాక్ క్రికెటర్ల డిన్నర్.. వీడియో వైరల్
పాకిస్థాన్ జట్టు ఏడేళ్ల తర్వాత ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చింది. భారత్ వచ్చిన పాకిస్థాన్ ఆటగాళ్లకు
By Medi Samrat Published on 1 Oct 2023 12:11 PM GMTపాకిస్థాన్ జట్టు ఏడేళ్ల తర్వాత ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చింది. భారత్ వచ్చిన పాకిస్థాన్ ఆటగాళ్లకు గొప్ప ఆతిథ్యం ఇస్తున్నారు. పాకిస్తాన్ జట్టు హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో బస చేసింది.. అక్కడ జట్టు ఆటగాళ్ళు విందును ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిసిబి షేర్ చేసిన వీడియోలో.. ఆటగాళ్లందరూ చాలా ఉత్సాహంగా కనిపించడం చూడవచ్చు. షాహీన్ నుండి బాబర్ ఆజం వరకు కూడా ఈ రాయల్ ఢిన్నర్‌లో భాగమయ్యారు. ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. పాకిస్థాన్ తన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
🎥 Hangout in Hyderabad: Glimpses from the Pakistan team dinner 🍽️#CWC23 pic.twitter.com/R2mB9rQurN
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2023
అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. అహ్మదాబాద్ స్టేడియంలో అక్టోబర్ 14న ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇటీవల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో ఇప్పటివరకూ ఓడిపోలేదు. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 7 సార్లు మ్యాచ్ జరగగా.. ప్రతిసారీ భారత జట్టు విజయం సాధించింది.
పాకిస్థాన్ జట్టు:
బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అగా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ . ఆఫ్రిది, మహ్మద్ వసీం.