ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. వారంలో 18,798 కేసులు..!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 20 నుంచి మే 26 వరకు వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 18,798 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు.

By Medi Samrat
Published on : 27 May 2025 6:33 PM IST

ట్రాఫిక్‌ ఉల్లంఘనలు.. వారంలో 18,798 కేసులు..!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మే 20 నుంచి మే 26 వరకు వారం రోజులపాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో మొత్తం 18,798 ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదు చేశారు. మే 27, మంగళవారం విడుదల చేసిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ ప్రకారం.. రహదారికి రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేసిన వాహనదారులపై సుమారు 14,917 కేసులు నమోదయ్యాయి. నంబర్ ప్లేట్ ఉల్లంఘనలకు సంబంధించి 3,881 కేసులు బుక్ చేయబడ్డాయి.

రహదారి నిబంధనలను పాటించి సురక్షితమైన హైదరాబాద్‌కు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. "ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. హైదరాబాద్‌ను సురక్షితంగా ఉంచుదాం" అని డిపార్ట్‌మెంట్ తన సందేశంలో #FollowTrafficRules అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి పేర్కొంది.

Next Story