రోడ్డు ప్ర‌మాదంలో కాంగ్రెస్‌ నేత కుమార్తె మృతి

Nampally Congress leader Daughter Taniya died in Road Accident.శంషాబాద్ ప‌రిధిలోని శాతంరాయి వ‌ద్ద సోమ‌వారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2022 7:33 AM IST
రోడ్డు ప్ర‌మాదంలో కాంగ్రెస్‌ నేత కుమార్తె మృతి

శంషాబాద్ ప‌రిధిలోని శాతంరాయి వ‌ద్ద సోమ‌వారం తెల్ల‌వారుజామున రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ఈ ప్ర‌మాదంలో ఓయువ‌తి మర‌ణించింది. మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వ‌స్తుండ‌గా కారు అదుపు త‌ప్పి ఢివైడ‌ర్‌ను ఢీ కొట్టి బోల్తా ప‌డింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన యువ‌తిని టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుమార్తె తానియాగా గుర్తించారు. ఆమె మృత‌దేహాన్ని ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. తానియా బ్యూటీషియ‌న్‌గా ప‌నిచేస్తున్నారు.

Next Story